హస్తిన వేదికగా హోదా పోరు

TDP MPs
TDP MPs

హస్తిన వేదికగా హోదా పోరు హోరెత్తుతోంది. తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాందీ విగ్రహం వద్ద నేడు మౌన దీక్ష చేయనున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో నిన్న ప్రధాని ఇంటి ముట్టడికి ప్రయత్నించిన తెలుగుదేశం ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్ పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ రోజు వారు మౌన దీక్ష చేపట్టనున్నారు.