స్వ‌ర్ణ దేవాల‌యాన్ని సంద‌ర్శించిన ట్రూడో

trudo visit punjab
trudo visit punjab

అమృత్‌స‌ర్ః అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేడు సందర్శించారు. భార్య, ముగ్గురు పిల్లలు, పలువురు మంత్రివర్గ సహచర బృందంతో ట్రూడో భారత పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా అమృత్‌సర్‌కు చేరుకున్న కెనడా ప్రధానికి విమానాశ్రయంలో హర్దీప్‌సింగ్ పూరీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్వాగతం పలికారు. ట్రూడో రాష్ట్ర పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కెనడా ప్రధానితో భేటీకి ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఇప్పటికే తెలిపిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరింద్ సింగ్ కాసేపట్లో జస్టిన్ ట్రుడోతో భేటీ కానున్నారు. అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ తన భార్య, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్‌తో కలిసి కెనడా ప్రధానిని కలవనున్నారు.