స్లో ఓవ‌రేట్ త‌ప్పిదానికి ర‌హానేకు జ‌రిమానా

AJINKYA RAHANE
AJINKYA RAHANE

ముంబైః మూడు వరుస విజయాలతో ఊపు మీదున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానేకు షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 94 పరుగులు చేయడంతో ఏడు వికెట్ల తేడాతో ముంబైపై ఈజీగా గెలిచింది రాజస్థాన్. 12 మ్యాచుల్లో 6 విజయాలతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ సీజన్‌లో తొలిసారి స్లో ఓవర్‌రేట్ తప్పిదానికి రాయల్స్ టీమ్ పాల్పడటంతో రూ.12 లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.