స్మృతి ఇరానీతో గంటా భేటీ

 

 

00000

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో ఎపి విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. అనంతపురంలో కేంద్రీయ, విజయనగరంలో గిరిజన వర్సిటీలు త్వరగా ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్రమంత్రి స్పందిస్తూ వర్సిటీలకు సంబంధించిన సవరణ బిల్లులు న్యాయశాఖ పరిశీలనలో ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే రెండు బిల్లులు ఆమోదం పొందేలా చూస్తామన్నారు.