స్పెల్‌ బీ పోటీల్లో నెగ్గిన ఎన్నారై బాలిక అనన్య

Ananya
Ananya

స్పెల్‌ బీ పోటీల్లో నెగ్గిన ఎన్నారై బాలిక అనన్య

వాషింగ్టన్‌:  90వ యుఎస్‌ స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో 12 ఏళ్ల వయస్సున్న భారతీయ అమెరికన్‌ బాలిక అనన్య  విజేతగా నిలిచింది. బాలికకు జ్ఞాపికతోపాటు 40వేల డాలర్ల నగదును బహూకరించారు.. సుమారు 12 గంటలపాటు జరిగిన ఈపోటీలో అన్నిపదాలకు అనన్య చాలా తేలికగా స్పెల్లింగులు చెప్పగలిగింది.. మారోకెయిన్‌ మార్రం, గిఫ్‌బ్లార్‌, వేజ్‌గూజ్‌ తదితర పలుపదాలకు ఆమె తడుముకోకుండా సమాధానం చెప్పింది.. అనన్యతో చివరి దాకా పోటీపడిన రోహన్‌ రాజీవ్‌ రన్నరప్‌గా నిలిచాడు.