సోమవారం..పోలవారం

AP CM
AP CM Chandra babu Naidu

సోమవారం..పోలవారం

అమరావతి: ఎపికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టు సిఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో పోలవరంమే చివరిప్రాజెక్టు అనఆనరు.. పెద్దప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తనకు రావటం తన పూర్వజన్మసుకృతమని తెదేపా సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆయన పేర్కొన్నారు.. పోలవరం ప్రాజెక్టు కోసం సోమవారం పేరుతో తన డైరీలో పోలవారంగా మార్చుకున్నానని అన్నారు.

పూర్తిచేసే సామర్ధ్యం ఎపికే ఉందన్న నీతి అమోగ్‌

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టును సమర్ధవంతంతా పూర్తిచేయగలిగిన సామర్ధ్యం ఒక్క ఎపి ప్రభుత్వానికే ఉందని, అందుకు ఆ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ పవర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పగించాలని నీతి అయోగ్‌ చెప్పిందని అన్నారు.. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకూడ కేంద్ర ప్రభుత్వమే చేపటి టుంటే దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, పోలవరం పరిస్థితి కూడ అలాగే ఉండేదని అన్నారు.

44శాతం పనులు పూర్తి

పోలవరం పనులు ఇప్పటికే 44శాతం పూర్తయ్యాయని చంద్రబాబు తెలిపారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2018 నాటి కల్లా గ్రావిటీతో నీళ్లు తేవాలన్నది ఉక్కు సంకల్పంగా చెప్పారు.. ఇప్పటివరకూ 14 పర్యాయాలు పోలవరం పనులను తనిఖీ చేశానని చెబుతూ, 18 పర్యాయాలు వర్చువల్‌ ఇన్స్‌క్షన్‌ చేశానాని అన్నారు.