సెప్టెంబరు నెలలో దేశానికి రఫేల్‌ యుద్ధవిమానం వస్తుంది

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి  ఈరోజు లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ విమానాల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇచ్చారు. భారత్‌ కొనుగోలు చేసిన తొలి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని, మిగిలిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2022 నాటి కల్లా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తవడానికి 14నెలల సమయం పట్టిందన్నారు. డిఫెన్స్‌ డీలింగ్స్‌కు.. డీలింగ్‌ ఇన్‌ డిఫెన్స్‌కు తేడా ఉందని వ్యాఖ్యానించారు. తాము డిఫెన్స్‌ డీలింగ్స్‌ చేయమని అన్నారు. దేశ భద్రతను, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకునే ఒప్పందాలు చేసుకుంటామని అన్నారు.