సీపీఎం భారీ ర్యాలీ

CPM

సీపీఎం జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఈ రోజు ఆ పార్టీ హైదరాబాద్ లో భారీ  ర్యాలీ నిర్వహించనుంది. అనంతరం సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది.మలక్ పేట టీవీటవర్ నుంచి  సీపీఎం రెడ్ షర్ట్స్ దళం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ర్యాలీ ప్రారంభించనుంది. ఈ ర్యాలీ సుమారు 7 కిలోమీటర్లు సాగి సరూర్ నగర్ స్టేడియం వద్దకు చేరుకుంటుంది. సీపీఎం బహిరంగ సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం అవుతుంది.