సిబిఐ,కేంద్రం, సివిసికి సుప్రీం నోటీసులు

supreem court
supreem court

ఆఫీసుకే పరిమితం కావాలని తాత్కాలిక డైరెక్టర్‌కు ఆదేశం
ఎలాంటి కీలకనిర్ణయాలు తీసుకోవద్దని సూచన
న్యూఢిల్లీ: నిబందనలకు విరుద్ధంగా తనను తొలగించారని, రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే తనను తొలగించిన ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ దాఖలుచేసిన అత్యవసర పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, సిబిఐ, కేంద్రప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తదుపరి వాయిదాను నవంబరు 12వ తేదీన విచారిస్తామని వెల్లడించింది. అంతేకాకుండా సర్వోన్నత న్యాయస్థానం సిబిఐ తాత్కాలిక చీఫ్‌ ఎం నాగేశ్వరరావును ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. అక్టోబరు 23నుంచి తీసుకున్న నిర్ణయాలు ఏమి అమలు కాకూడదని ఆదేశించింది. అన్ని నిర్ణయాలను ఎంఎన్‌రావు సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందచేయాలని కోరింది. సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎకె పట్నాయిక్‌ నేతృత్వంలో సెంట్రల్‌ విజిలెన్స్‌కమిషన్‌ ఆరోపణలపై విచారణ, ప్రత్యారోపణలపై పరిశీలనచేసి తనకు నివేదిక అందచేయాలని, రెండువారాల్లోపు నివేదిక ఇవ్వాలని కోరింది. చీఫ్‌జస్టిస్‌ రంజన్‌ గగో§్‌ు వచ్చే విచారణను నవంబరు 12వ తేదీకి వాయిదా వేసారు. జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, కెఎంజోసెఫ్‌లు స్వఛ్ఛందసంస్థ కామన్‌కాజ్‌ జారీచేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. అంతేకాకుండా సిబిఐ అధికారుల అంతర్యుద్ధంపై దర్యాప్తునకు సిట్‌ను నియమించాలని పిటిషన్‌ వాదనను కూడా విచారించాలనినిర్ణయించారు. సిబిఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానా పేరును కూడా ప్రతివాదుల్లో ఒకరిగా ఎన్‌జిఒ సంస్థ చేర్చింది. వర్మ, ఆస్తానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సంక్షిప్త విచారణలోస ఈనియర్‌ న్యాయవాది ఎప్‌ఎస్‌ నారిమన్‌ సిబిఐ ఛీఫ్‌ తరపున వాదనలను ముమ్మరంచేసారు. సిబిఐ డైరెక్టర్‌గా నియామకం ఒక ప్రత్యేకప్యానెల్‌ ప్రధాన మంత్రి, ప్రతిపక్షనేత,సుప్రీం చీఫ్‌జస్టిసల్‌తో కూడిన ప్యానెల్‌ ఆమోదం తర్వాతనే నియమించారని వాదించారు. సివిసి, కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు ప్రస్తుతం వర్మ విధులను నిలిపివేసినట్లుగా ఉందన్నారు. వర్మ అభ్యర్ధనలకు మద్దతుగా నారిమన్‌ వినీత్‌నారాయణ్‌ తీర్పునుసైతం జోడించారు. ప్రారంభంలో సర్వోన్నత న్యాయస్థానం సివిసి ఈ ఆరోపణలపై పదిరోజుల్లో విచారణచేసి కోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించింది. సివిసి పదిరోజులపాటు విచారణ కష్టమని మరికొన్ని దస్త్రాలు అవసరం అవుతాయని కోరింది. అందువల్ల ఎవ్వరి పర్యవేక్షణ లేకుండానే విచారణకొనసాగించాలని పట్టుబట్టింది. దీనితో సివిసికి రెండు వారాలపాటు వ్యవధిని పొడిగించింది. అలాగే వర్మ కేంద్రం ఉత్తర్వులపై స్టే ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ దాఖలుచేసిన పిటిషన్‌ను, ఎంఎన్‌రావుకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉన్న ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలుచేసిన పిటిషన్‌నుసైతం సుప్రీం విచారణకు చేపట్టింది. అయితేసుప్రీంకోర్టు మాత్రం ఎలాంటి స్పష్టమైన ఉత్తర్వులు లేకుండా వర్మను తిరిగి తీసుకోవాలన్న పిటిషన్‌ను విచారణకు ఆదేశిస్తామని వెల్లడించింది. రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వంలో ఈ విచారణజరుగుతుందని వెల్లడించింది అంతేకాకుండా ప్రస్తుత తాత్కాలిక డైరెక్టర్‌ ఎంఎన్‌రావు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని, నిర్ణయాలను ముందే సీల్డ్‌కవర్‌లో సుప్రీంకు నివేదించాలని వెల్లడించింది. దీనితో ఆయన ఆకస్మికంగా చేసిన 12 బదిలీలుసైతం నిలిచిపోయాయి.