సినిమాల‌కు స్వ‌స్తి, రాజ‌కీయాల్తో కుస్తీ

Kamal Hassan
Kamal Hassan

విశ్వ‌న‌టుడు, భార‌త‌దేశ అగ్ర‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న అభిమానుల‌కు నిరాశ‌ను మిగులుస్తూ సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌.. ఇక‌పై సినిమాలు చేయ‌న‌ని తేల్చిచెప్పారు. ప్ర‌స్తుతం బోస్ట‌న్‌లో ఉన్న క‌మ‌ల్.. అక్క‌డ ఓ ప్రైవేట్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యం వెల్ల‌డించారు. అయితే ఇప్ప‌టికే నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు సినిమాలు మాత్రం య‌థావిధిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాయ‌ని తెలిపారు.