సిఎస్‌ల భేటీ

Chief Secretaries of AP and Telangana
Chief Secretaries of AP and Telangana

సిఎస్‌ల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ- ఏపీ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కా రానికి తరచూ సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు నిర్ణయించారు. ఆయా శాఖల అధికారులతో ఇరువురూ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని అంగీకారానికి వచ్చారు. శుక్రవారం బేగంపేటలోని మెట్రో రైల్‌ భవన్‌లో తెలంగాణ- ఏపీ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్కే జోషి, దినేశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విభజన, ఆస్తులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలోని 750 మంది ఉద్యోగులు, అధికారులను కమలనాథన్‌ కమిటీ ఏపీకి కేటాయించింది. తాము అక్కడ ఉండేది లేదని ఆ ఉద్యోగులు ఆందోళన చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో మొదటి అంశంగా ఉద్యోగుల బదిలీలపై చర్చించారు.

ప్రధానంగా 4వ తరగతి ఉద్యోగుల సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య పరస్పర బదిలీలు, భార్యాభర్తల బదిలీలపై ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరగా దీనికి అనుగుణంగా ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. అయితే, సబ్జెక్టు టు సబ్జెక్టు ఉద్యోగులనే పరస్పర బదిలీలు చేయాలన్న నిబందన కారణంగా పరస్పర బది లీలు పూర్తి కావడం లేదు. ప్రధానంగా విద్యా శాఖలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. లెక్చర్ల బదిల్లీలోనే ఈ సమస్య బాగా ఉంది. సబ్జెక్టుతో సంబంధం లేకుండా పరస్పర బదిలీలకు విద్యా శాఖలో కుదురుతుందా లేదా? అనేది సమీక్షిం చాల్సిందిగా తెలంగాణ సర్కార్‌కు సూచించారు.

పరస్పర బదిలీలపై సమస్యలను పరిష్కరించేం దుకు ఏపి నుంచి రిటైర్డ్‌ అధికారి ఎల్‌.ప్రేమ చంద్రారెడ్డి, తెలంగాణ నుంచి ఆర్ధిక శాఖ అధి కారి రామకృష్ణారావుతో కలిపి నూతన కమిటీని నియామకం చేశారు. రెండు రాష్ట్రాల సిఎస్‌ల భేటీలో ఈ సందర్భంగా ఏపీ సచివాలయం, శాసనసభ భవనాలతో పాటు హైదరాబాద్‌లో ఆ రాష్ట్ర ఆధీనంలో ఉన్న ఇతర ప్రభుత్వ కార్యా లయాలను అప్పగించాలని తెలంగాణ సీఎస్‌ ఏపీ సీఎస్‌ను కోరారు. దీనిపై తమ ప్రభుత్వం విధా నపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ అధికారులు వెల్లడించారు. దిల్లీలోని ఏపీ భవన్‌ విభజన కమిటీ సమావేశమయ్యేలా చూడాలనీ,డీఎస్పీల విషయంలో హైకో ర్టు అనుమతితో తాత్కాలిక ప్రాతిపదికన =====