సిఎం పదవిలోఉండి అల వ్యాఖ్యనించడం సరికాదు

 

Yeddyurappa
Yeddyurappa

బెంగళూరు: జెడిఎస్‌ నేత ప్రకాష్‌ హంతకులను కాల్చి పారేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేసి కెమెరాకు చిక్కిన కర్ణాటక సిఎం కుమారస్వామి పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప విమర్శలు చేశారు. సిఎం పదవిలో ఉండి ఇంత బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేసిన సిఎం వేంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రైతులు చనిపోయినప్పుడు, ప్రభుత్వ అధికారులు హతమైనప్పడు ఇలా ఎప్పుడైనా స్పందించారా అని బీజేపీ రాష్ట్ర యూనిట్ ఓ ట్వీట్‌లో సీఎంపై మండిపడింది.