సాయి ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తులో కానరాని పురోగతి

Vijay Sai
Vijay Sai Family (file)

కమెడియన్‌  సాయి ఆత్మహత్యపై

పోలీసుల దర్యాప్తులో కానరాని పురోగతి

విజ§్‌ు భార్య వనితా రెడ్డి, నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండి శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌లపై చర్యలు వుండవా…?
సిఆర్‌పిసి 41 కింద నోటీసులు ఇచ్చామంటున్న పోలీసులు…ఇప్పటి వరకు సమాధానం ఇచ్చేందుకు పోలీసుల ముందుకురాని నిందితులు
సమాధానం ఇచ్చేందుకు రాకుంటే అరెస్టు చేస్తామని చెబుతున్న పోలీసులు ఎప్పుడు చేస్తారో చెప్పడం లేదు
టివిలకు ఇంటర్వ్యూ ఇస్తున్న వనిత పోలీసులకు చిక్కదా…? అని ప్రశ్నిస్తున్న విజ§్‌ు కుటుంబీకులుత
కేసును నీరుగార్చేందుకు పోలీసులపై బడా నేతల ఒత్తిడి….?
హైదరాబాద్‌, డిసెంబర్‌ 21, ప్రభాతవార్త: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపిన యువ కమెడియన్‌ విజ§్‌ు ఆత్మహత్యకు సంబంధించిన కేసు నీరుగారుతోందా …? ఈ కేసులో నిందితులుగా వున్న విజ§్‌ు భార్య వనితా రెడ్డి, నవయుగా కన్‌స్ట్రక్షన్స్‌ ఎండి శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌లపై చర్యలు వుండవా…? తన ఆత్మహత్యకు ఈ ముగ్గురు కారణమని విజ§్‌ు బలవన్మరణానికి ముందు సెల్‌ఫోన్‌లో సెల్పీ ద్వారా వెల్లడించిన అంశాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై విజ§్‌ు కుటుంబ సభ్యులు భగ్గుమంటున్నారు. వనితా రెడ్డి నగరంలోనే వున్నట్లుగా టివిలకు ఇస్తున్న ఇంటర్వ్యూ ల ద్వారా బట్టబయలవుతున్నా ఆమెను విచారించక పోవడానికి గల కారణాలేమిటీ…? ఇందుకు కారకులెవరూ…? ఎవరి ప్రమేయం వల్ల జాప్యం జరుగుతోంది…?

రాజకీయ ఒత్తిడి ఏమైనా వుందా…? నవయుగా కంపెనీకి చెందిన కార్లలో వనితా రెడ్డి తిరిగినట్లు పోలీసుల వద్ద గట్టి ఆధారాలున్నా పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడంపై కారణాలెమిటీ….? కారడవుల్లో వున్న నక్సలైట్లను కూడా అదుపు చేస్తున్నారనే పేరు ప్రతిష్టలున్న తెలంగాణ పోలీసులకు నగరం నడిబొడ్డులో వున్న ఒక సాధారణ మహిళను పట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు…? పోలీసుల అసమర్థతగా దీనిని భావించే అవకాశాలు లేక పోయినా, రాజకీయ నేతల పలు కుబడికి పోలీసులు లొంగిపోతున్నారా…? కేసును మరెంత కాలం పెండింగ్‌లో పెట్టాలని పోలీసులు చూస్తున్నారే అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేయసాగారు. తన చావుకు కారణాలేమిటీ…? కారకులెవరు…? ససాక్షంగా మృతుడు విజ§్‌ు సాయి వీడియో ఆధారాన్ని అందించినప్పటికీ అతను వెల్లడించిన వారిని విచారించక పోవడంలో అంతర్యమేమిటీ…? పెద్దల హస్తంతోనే కేసును నీరుగార్చే యత్నం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో హీరో కం కెమెడియన్‌గా వున్న యువకుడు విజ§్‌ు సాయి ఆత్మహత్యపై పోలీసుల విచారణ ముందుకు సాగక పోవడంపై అతని కుటుంబ సభ్యులతో పాటు సీనీ వర్గాలు కూడా అనుమానాలు వ్యక్తం చేయసాగారు. ఈ నెల 11వ తేదీన యూసుఫ్‌గూడలోని తన అపార్ట్‌మెంట్‌లో విజ§్‌ు సాయి ఉరి వేసుకు ని ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే.

ఉదయం కుటుంబ సభ్యులందరితో కలిసి టిఫిన్‌ చేసిన ఇతను మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు విజ§్‌ు సాయి సెల్‌ఫోన్‌లో సెల్ఫీద్వారా కొన్ని విషయాలను వెల్లడించాడు. తాను కొంత కాలంగా మానసికంగా కృంగి పోతున్నానని, ఇందుకు తన భార్య వనితా రెడ్డితో పాటు నవయుగ కంపెనీ ఎండి శశిధర్‌, వారి తరపు న్యాయవాది శ్రీనివాస్‌లు ప్రధాన కారణమని అతను అందులో తెలిపాడు. తన ఇంటి నుంచి తాను ఉపయోగించే కారును కూడా భార్య వనితా రెడ్డి కొందరు గూండాల సహయంతో బలవంతంగా తీసుకు పోయిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి పురోగతి లేదని విజ§్‌ు సాయి వాపోయాడు. తన కూతురు చూసేందుకు కూడా భార్య అనుమతించడం లేదని ఆవేదన చెందాడు. విడాకుల కోసం ఇద్దరం కోర్టుకు ఎక్కిన మాట వాస్తవమేనని, అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు రెండు గంటలు కేటాయించమని వేడుకున్నా భార్య అంగీకరించలేదని అతను వాపో యాడు. కాగా విజ§్‌ు సాయి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు అతని తండ్రి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బార్య వనితా రెడ్డి, నవ యుగ కంపెనీ ఎండి శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌లపై కేసులు నమోదు చేశారు.

దీని తరువాత విజ§్‌ు సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉరి వేసుకోవడం వల్ల విజ§్‌ు సాయి చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో తేలింది. విజ§్‌ు సాయి అంత్యక్రియలు మరుసటి రోజు జరిగాయి. దీని తరువాత పోలీసుల విచారణ మొదలైనా పది రోజులుగా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. విజ§్‌ు సాయి సెల్ఫీ ద్వారా వెల్లడించిన వివరాలు, దీనిపై అతని తండ్రి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు అయితే పమోదు చేశారు తప్పించి నిందితులుగా వున్న వారిని ఇప్పటి వరకు విచారించడం లో విఫలమయ్యారు. ఈ కేసులో నిందితులుగా వున్న విజ§్‌ు సాయి భార్య వనితా రెడ్డి, నవయుగ ఎండి శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌లను విచారించేందుకు వారి కి సిఆర్‌్‌పిసి 41 కింద నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు వారు అక్కడ లేక పోవడంతో మొదట వెనక్కు వచ్చి తరువాత వారి తరపున వున్న వారికి వీటిని అం దజేశారు.

ఈ నోటీసులకు వనితా రెడ్డి, శశిధర్‌, శ్రీనివాస్‌లు స్పందించి తాము అన్ని విషయాలు చర్చించుకుని విచారణకు వస్తామని ఫోన్‌ ద్వారా పోలీసులకు వెల్లడిం చినా ఇంత వరకు రాలేదు. దీనిపై పోలీసులు కూడా మౌనంగా వుండడంపై విజ§్‌ు సాయి కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు. మరోవైపు వనితా రెడ్డి తన భర్త రాసలీలలు చూడంటంటూ కొన్ని వీడియో దృశ్యాలను మీడియాకు అందించడం, ఇదే సమయంలో  సాయి గురించి టివిలకు ఇంటర్వ్యూలు ఇస్తుండడం సంచల నంగా మారింది. ఇదే సమయంలో న్యాయవాది శ్రీనివాస్‌ కూడా మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో నిందితులుగా వున్న వీరిద్దరు పోలీసుల నోటీసులకు స్పందిం చి విచారణకు రాకపోగా మీడియాలో మాట్లాడడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయసాగారు.  సాయి కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయమై పోలీసుల పై భగ్గుమంటున్నారు.
కేసు నీరుగార్చేందుకు పోలీసులపై బడా నేతల ఒత్తిడి వుందంటున్న  సాయి కుటుంబీకులు
ఇదిలావుండగా  సాయి ఆత్మహత్యకు సంబంధించిన కేసును నీరుగార్చేందుకు పోలీసులపై బడా రాజకీయ నేతల ఒత్తిళ్లు వున్నాయని అతని తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వనితా రెడ్డితో పాటు నవయుగ కంపెని ఎండి శశిధర్‌, న్యాయవాది శ్రీనివాస్‌లకు రాజకీయ పలుకుబడి వుండడం వ ల్లే వారిపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విజ§్‌ు సాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నవయుగ కంపెని ఎండి శశి ధర్‌ తన కంపెనీ అవసరాలకు వనితా రెడ్డిని మరికొందరు మహిళలను వాడుకుంటాడన్న అభియోగాలున్నాయని వీటిపైన కూడా పోలీసులు విచారణ చేయాలని వారు డిమాండ్‌ చేయసాగారు. వనితా రెడ్డి నవయుగ కంపెనికి చెందిన కార్లతో ఎందుకు తిరుగుతుందనే దానిపైనా పోలీసులు విచారిస్తే విజ§్‌ు సాయి ఆత్మహత్యకు సంబం ధించి అనేక విషయాలు వెలుగు చూసే వీలుందని వారంటున్నారు. అయితే ఈ కేసులో పోలీసుల విచారన సవ్యంగా సాగుతుందనే నమ్మకం తమకు కనిపించడం లేద ని వారంటున్నారు. విజ§్‌ు సాయి ఆత్మహత్య కేసులో విచారణ ఇకనైనా వేగంగా సాగాలని, లేకుంటే తాము ఆందోళన చేస్తామని అతని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసుల వివరణ మరోలా వుంది. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఈ కేసులో సిఆర్‌పిసి 41 సెక్షన్‌ కింద ముగ్గురు నిందితుల కు నోటీసులు ఇచ్చామని, వారు విచారణకు రావాల్సి వుందని, అయితే ఇప్పటి వరకు ఎందుకు రాలేదో…? విచారిస్తున్నామని, వారు విచారణకు రాకుంటే చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.