సాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు

TEMPARATURE FALLS
TEMPARATURE FALLS

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని రామగుండం, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ మూడు జిల్లాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో పది రోజుల కిందట ఉన్న ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో గజగజలాడిన ఆదిలాబాద్‌ జిల్లాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. గడచిన 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలుగా నమోదయ్యాయి. తెలంగాణలో ఆగ్నేయ దిక్కు నుండి, ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య దిశ నుండి చలిగాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. తెలంగాణలో ఆదివారం నుండి మూడు రోజుల వరకూ పొడి వాతావరణం ఉంటుందని, చలి తీవ్రత చాలా వరకూ తగ్గుతుందని పేర్కొన్నారు.