సాత్విక ఆహారంతో జ్ఞాప‌క‌శ‌క్తి

                          సాత్విక ఆహారంతో జ్ఞాప‌క‌శ‌క్తి

FOOD
FOOD

జ్ఞాపకశక్తిని మనం తేలికగా తీసుకుంటాం. కానీ అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్ర పోయేవరకూ చేసే ప్రతి చిన్న పనికీ మనం జ్ఞాపకాల మీదే ఆధారపడతాం. విషయాలకు సంబంధించిన సమాచారమంతా మెదడులో జ్ఞాపకంగా నిక్షిప్తమై ఉండబట్టే మన దైనందిన జీవితం సాఫీగా సాగిపోతోంది. మనం చూసే, చేసే, మన అనుభవంలోకి వచ్చే ఒక సూచారం జ్ఞాపకంగా మారాలంలే ఎన్‌కోడింగ్‌, స్టోరేజ్‌, రిట్రీవల్‌ అనే మూడు దశలు దాటాలి. ఈ మూడు దశలూ దాటిన ప్రతి సమాచారం మనకు జీవితకాలం గుర్తుండిపోవాలనే రూలేం లేదు. కొన్ని క్షణం పాటు గుర్తుండవచ్చు. ఇంకొన్ని కొన్ని రోజులు, నెలలపాటు, మరికొన్ని జీవితకాలంపాటు జ్ఞాపకం ఉండొచ్చు. సమాచారం ప్రాధాన్యాన్ని బట్టి మెదడే ఈ తేడాలను పాటిస్తుంది. కాబట్టే మెదడుకు వెళ్లిన సూచారం సెన్సరీ, షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ మెమరీల రూపంలో నిక్షిప్తమై ఉంటోంది. సెన్సరీ మెమరీ వ్యవధి ఒక సెకను. మన మందు నుంచి ఒక కారు వెళ్లిపోయింది ఆ విషయాన్ని ఆ క్షణం తర్వాత మరిచిపోతాం. షార్ట్‌టర్మ్‌ మెమరీ వ్యవధి ఒక నిమిషం. పదే పదే పునరావృతమైతే ఎక్కువకాలం గుర్తుండవచ్చు. పాఠాలు చదవటం ఈ కోవకే చెందుతుంది. లాంగ్‌ టర్మ్‌ మెమరీ వ్యవధి జీవిత కాలం. డ్రైవింగ్‌, ఆటలు ఆడటం లాంటివి. సాధన చేయకపోయినా పూర్తిగా మరిచిపోము. పాఠాలు మెదడులో ఉండిపోవాలంటే నేర్చుకున్న పాఠాన్ని చూడకుండా రాస్తే నూటికి నూరుశాతం గుర్తుండిపోతుంది. అయితే ఇలా నేర్చుకున్న పాఠం ఎప్పటికీ మరిచిపోకుండా ఉండాలంటే పాఠం మనకు అర్ధమయిందో లేదో పరీక్షించుకోవాలి. కథల పుస్తకాలు చదివినంత ఇష్టంగా క్లాసు పుస్తకాలు చదవాలి. కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నట్లు, ఆసక్తికరమైన అంశం దొరికినట్లు పాఠం చదివితే ఎంత కష్టమైనదేనా తేలిగ్గా తలకెక్కుతుంది. చదివిన దానికి దృవ్యరూపమిస్తే చదివింది గుర్తుండిపోయే అవకాశం ఎక్కువ. పేజీల కొద్దీ విషయాన్ని చిన్న టైమ్‌ ఫ్రేమ్‌లోకి మలిచి కాలక్షేపాన్ని అందించేవి డాక్యుమెంటరీలు. వీటిని చూడటం వల్ల పాయింట్లు తేలికగా గుర్తుంచుకోవచ్చు. జ్ఞాపకశక్తి పెరగాలంటే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షల సమయంలో తప్పక తినవలసినవి బీట్‌రూట్‌, బోన్‌సూప్‌, బ్రాకోలీ, గుడ్డులో పచ్చసొన వంటివి. ఇంకా ఆకుకూరలు. ఆకుకూరలు మెదడు సామర్ధ్యాన్ని పెంచుతాయి. వీటిలో సమృద్ధిగా ఉండే ఎ, కె విటమిన్లు మెదడు కణాలైన న్యూరాన్ల మధ్య సమాచారా ప్రసారాన్ని సరళం చేస్తాయి. వాల్‌నట్స్‌ తింటే మెంటల్‌ అలర్ట్‌నెస్‌ పెరుగుతుంది. మెదడులోని హిప్పోక్యాంపస్‌ జ్ఞాపకశక్తి కేంద్రం. ప్రతి పదేళ్లకు అయిదు శాతం చొప్పున హిప్పోక్యాంపస్‌లోని న్యూరాన్లు నశిస్తూ ఉంటాయి. దీంతోపాటు జ్ఞాపశక్తికి ఉపయోగపడే అసిటైల్‌ కోలీన్‌ అనే న్యూరోట్రాన్స్‌మీటర్‌ ఉత్పత్తి కూడా వయసుతోపాటు తగ్గుతుంది. ఫలితంగా మతిమరుపు వేధిస్తుంది. ఈ మార్పుల్ని నెమ్మదించాలంటే మెదడు యాక్టివిటీని పెంచే మెమరీ గేమ్స్‌ రెగ్యులర్‌గా ఆడుతుండాలి. పజిల్స్‌, సుడోకు లాంటి గేమ్స్‌ ఆడాలి. మెదడుకు పని పెంచే చదరంగం ఆడొచ్చు. క్రాస్‌వర్డ్స్‌ మరీ తరచుగా ఆడకూడదు. చకచకా పూరించేసి పెన్ను పక్కన పెట్టేసే క్రాస్‌వర్డ్స్‌ ఆట వల్ల ఫలితం ఉండదు. ఈ ఆట అరుదుగా ఆడాలి. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు సరుకుల లిస్ట్‌ రాసుకున్నా, ఆ లిస్ట్‌ చూడకుండా వాటిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆకారాలు, రంగులు సరిపోయేలా చేయాల్సిన జిగ్‌సా పజిల్స్‌ వల్ల షార్ట్‌టర్మ్‌ మెమరీ లాస్‌ మెరుగవ్ఞతుంది. రెండు మూరు రకాల కీస్‌ వాడే వీలున్న మల్టీటాస్కింగ్‌ వీడియో గేమ్స్‌ ఆడితే కాగ్నటివ్‌ ఫంక్షన్‌ పెరుగుతుంది. ప్రతి ఒకరికీ ఏదో ఒక సందర్భంలో మతిమరుపు అనుభవంలోకి రావటం సహజం. అయితే తేలికగా తీసుకునేవి తేలికగా తీసుకోవాలి. సీరియస్‌గా తీసుకునేవి సీరియస్‌గా తీసుకోవాలి.