సరికొత్త చరిత్ర సృష్టించిన జకోవిచ్‌…

novak djokovic
novak djokovic

ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన నొవాక్‌ జొకోవిచ్‌…
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెర్బియి స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫైనల్లో మరోసారి చెలరేగిపోయాడు. జకోవిచ్‌ మరోసారి క్రీడా ప్రపంచానికి తన సత్త ఏంటో గుర్తు చేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏడోసారి ఫైనల్లోకి ప్రశేశించిన…ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న జకోవిచ్‌…ఫైనల్లో ప్రపంచ నంబర్‌ 2 నాదల్‌పై గెలుపొందాడు. ఏకంగా ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో జొకోవిచ్‌ 6-3, 6-2, 6-3తేడాతో మాజీ ఛాంపియన్‌ ప్రపంచ రెండో ర్యాంకర్‌ రఫెల్‌ నాదల్‌ను మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సెర్బియా స్టార్‌ దూకుడు ముందు నాదల్‌ తేలిపోయాడు. వరుసగా మూడు సెట్లను సునాయాసంగా కైవసం చేసుకోవడంతో నాదల్‌కు ఓటమి తప్పలేదు. దీంతో రా§్‌ు ఎమర్సన్‌, ఫెదరర్‌ (ఆరుసార్లు విజేతలుగా నిలవడం)లపేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌ (2008, 2011, 2012, 2013, 2015, 2016)ఆరుసారు ఛాంపియన్‌గా నిలిచాడు. తాజాగా ఏడో టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఏ దశలోనూ నాదల్‌కు అవకాశమివ్వని జకోవిచ్‌ పూర్తి ఆధిపత్యం కనబర్చాడు.దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ను అత్యధికంగా ఏడు సార్లు సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లో చేరాడు. ఈవిజయంతో జకోవిచ్‌ ఖాతాలో 15వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ చేరింది. దీంతో గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో పీట్‌ సంప్రాస్‌ (14)ను నొవాక్‌ అదిగమించాడు. 15గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో జకోవిచ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. 17 గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లతో నాదల్‌ రెండో స్థానంలో…20 టైటిళ్లతో మొదటి స్థానంలో ఫెదరర్‌ కొనసాగుతున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచిన రికార్డుల్లోనూ జకోవిచ్‌ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు.
జొకోవిచ్‌ జైత్రయాత్ర సాగిందిలా….
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన జోవిల్‌ఫ్రెడ్‌ సోంగాపై 6-3, 7-5, 6-4తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. మూడో రౌండ్‌లో జకోవిచ్‌ కెనడా క్రీడాకారుడు 25వ సీడ్‌ షపవలోవ్‌పై 6-4, 6-4, 4-6, 6-0పై గెలుపొంది ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ప్రీక్వార్టర్‌లో నొవాక్‌ జకోవిచ్‌ 15వ సీడ్‌ రష్యా క్రీడాకారుడు మెద్వెదెవ్‌పై 6-4,6-7(5/7),6-2,6-3తో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాటడు. క్వార్టర్స్‌లో జొకోవిచ్‌ జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్‌ కీ నిషికోరిపై 6-1,4-1తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరాడు. సెమీఫైనల్లో జొకోవిచ్‌ 6-0, 6-2, 6-2తో 28వ సీడ్‌ ఫ్రాన్స్‌ క్రీడాకారుడు లుకాస్‌ పుయిపై విజయం సాధించి ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశించిన జకోవిచ్‌ ఫైనల్లో నాదల్‌పై 6-3, 6-2, 6-3తో విజయం సాధించి ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను కైవసం చేసుకొని రికార్డు సృష్టించాడు.