సన్‌జౌన్‌ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి

incident1
camp office

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సన్‌జౌన్‌ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా, పౌరుడికి గాయాలయ్యాయి. ఉగ్రదాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. ఆర్మీ క్యాంప్‌పై దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.