సత్తా చాటిన భారత సంతతి మహిళలు

IMP WOMEN's


అమెరికాలోని 80 మంది అత్యంత ధనిక మహిళల జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యాపారులు స్థానం సంపాదించారు. ఈ జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. అందులో అరిస్టా నెట్‌వర్క్స్‌ సీఈవో జయశ్రీ ఉల్లాల్‌, సింటెల్‌ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథీ, కన్‌ప్లయెంట్‌ టెక్నాలజీ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్కేడే ఉన్నారు. ఈ జాబితాలో ఏబీసీ సప్లై సంస్థ చైర్‌పర్సన్‌ డయానే హెండ్రిక్స్‌ దాదాపు రూ.4 లక్షల కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచారు. జయశ్రీ ఉల్లాల్‌ రూ.97 వేల కోట్లతో 18వ స్థానంలో ఉన్నారు. 23వ స్థానంలో నిలిచిన నీరజా సేథీ సంపాదన రూ.35 వేల కోట్లు. 60వ స్థానంలో ఉన్న నేహా నార్కేడ్‌ సంపాదన దాదాపు రూ.24 వేల కోట్లు.