సచిన్‌ కుమార్తెకు తప్పని వేధింపులు

SARA TENDULKAR
SARA TENDULKAR

సచిన్‌ కుమార్తెకు తప్పని వేధింపులు

ముంబయి: ప్రముఖుల కుమార్తెలకు కూడా ఆకతాయిల నుంచి వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఇకెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ను వేధింపులకు గురి చేసిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సచిన్‌ ఇంట్లోని ల్యాండ్‌ లైన్‌కి పలుమార్లు ఫోన్‌ చేసి సారాను వేధించడమే కాకుండా…కిడ్నాప్‌ కూడా చేస్తారని నిందితుడు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. సారా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవ్‌ కుమార్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తనకు సారాతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ సచిన్‌ ఇంటికి ఫోన్‌ చేసి దేవ్‌ కుమార్‌ పలుమార్లు బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సచిన్‌ ల్యాండ్‌ నంబర్‌కు 20 సార్లు ఫోన్‌ చేసినట్లు చెప్పారు. సారా గురించి అతడు అసభ్యంగా మాట్లాడినట్లు తెలి పారు. ఈ వేధింపులకు సంబంధించి డిసెంబర్‌ 5న బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెలఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నిందితుడ్ని పట్టుకున్నారు. దేవ్‌ కుమార్‌ మానసిక స్థితి సరిగా లేదని, గత కొంతకాలంగా అతడు వింతగా ప్రవరిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. సోమవారం అతడ్ని ముంబై కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ===