శ్వేత సౌధంలో దీపావ‌ళి కాంతులు!

white house
white house

ఢిల్లీః .అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలో తొలిసారిగా దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. గ‌తంలో ఒబామా హ‌యంలో ప్రారంభించిన ఇఫ్తార్‌ విందును ట్రంప్‌ రద్దు చేయడంతో దీపావళి వేడుకలను కూడా రద్దు చేస్తారని కొందరు భావించారు. కానీ ఈ వేడుకలను శ్వేతసౌధంలో ఘనంగా జరపాలని ట్రంప్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సందర్భంగా వాషింగ్టన్‌ డీసీలోని పెన్సుల్వేనియా ఎవెన్యూలో దాదాపు 200 మంది భారతీయ-అమెరికన్లకు దీపావళి పండుగ ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా భారతీయ-అమెరికన్లు ఎదుర్కొంటున్న వీసా సమస్యల గురించి అధ్యక్షుడితో చర్చించాలని కమ్యూనిటీ సభ్యులు భావిస్తున్నట్లు ట్రంప్‌ మద్దతుదారుడు షలభ్‌కుమార్‌ తెలిపారు.