శ్రీదేవి మరణంపై సుందర్‌ పిచాయ్‌ ఆవేదన

sunder pichai
sunder pichai

ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఆకస్మిక మరణం పట్ల గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి ఓ మార్గదర్శకురాలని ,తనలాంటి ఎంతో మందికి స్పూర్తి ప్రధాత అని అన్నారు. ఆమె మరణం తీరని లోటు అని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని అన్నారు. తాను అభిమానించే అనేక శ్రీదేవి సినిమాల్లో ‘సద్మ’ ఒకటని ..తన కుటుంబంతో కలిసి శ్రీదేవిని చూడటం మరచిపోలేని జ్ఞాపకమని చెప్పారు. బోనీ కపూర్‌ ఆవేదనతో పెట్టిన ట్విట్టర్‌ మెసేజ్‌కు సుందర్‌ పిచాయ్‌ పై విధంగా స్పందించారు.