శునకానికి గౌరవ డిప్లొమా!

dog
dog

ఆల్బని: తన యజమానిని నిరంతరం వెంట ఉండి సేవలందించిన పెంపుడు శునకానికి క్లార్క్‌సన్‌ విశ్వవిద్యాలయం గౌరవ డిప్లొమాను అందచేసింది. బ్రిట్టనీ హాలే అనే దివ్యాంగురాలికి బాసటగా నిలిచిన గ్రిఫిన్‌ అనే శునకం సేవలను ప్రతి ఒక్కరూఈ కార్యక్రమంలోప్రస్తుతించారు. బ్రిట్టన్‌ హాలే ఆక్యుపేషనల్‌ థెరపీలో క్లార్క్స్‌న్‌ వర్సిటీనుంచి ఈ వారాంతంలో పిజిడిగ్రీని అందుకున్నారు. ఈ డిగ్రీ అందుకున్న సందర్భంలో కూడా గ్రిఫిన్‌ హాలే వెంటనే నిలుచుంది. నేనేమి చేయగలుగుతానో తన గ్రిఫిన్‌ సైతం అన్నీ చేస్తుందని మాలే వెల్లడించింది. వర్సిటీ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ అధ్యక్షుడు టోనీ కొల్లిన్స్‌ శునకం గ్రిఫిన్స్‌కు గౌరవ డిప్లొమాను అందచేసారు. ఈ నాలుగేళ్ల శునకానికి గోల్డెన్‌ రిట్రీవర్‌ సేవాగుర్తింపును కల్పించారు. సహజంగానే వీల్‌చైర్‌లు అంటే శునకాలు వెనుకంజవేస్తాయి. కాని గ్రిఫిన్‌ మాత్రం ఒక్కుదుటున వీల్‌చైర్‌లో ఉన్న హాలే తొడపై కూర్చుని ముఖం మొత్తం ముద్దులతో నింపేస్తుందని చెప్పారు. నాకు వచ్చే రోగులుసైతం మా థెరపిస్టు బ్రిట్టనీతోపాటు గ్రిఫిన్‌కూడాని చెపుతుంటారని బ్రిట్టనీ వెల్లడించారు. గ్రిఫిన్‌లేకుండా తానేమీ చేయలేనని బ్రిట్టనీ వెల్లడించారు. ఒకవేళ ఉద్యోగానికి వెళ్లినా తనతోపాటు గ్రిఫిన్‌కు కూడా ఒకేప్యాకేజిమాట్లాడుకుంటామని బ్రిట్టనీ గర్వంగా చెప్పింది.