శివ టు వంగవీటి!

vangaveeti
vangaveeti

శివ టు వంగవీటి!

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రెస్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. ఆయన ఏం చేసిన అది సంచలనం అవుతుంది. ఇంక తన సినిమాను ప్రమోట్‌ చేసుకోవడంలో వర్మకి తెలిసిన టెక్నిక్స్‌ మరెవరకి తెలియదనే చెప్పాలి. విజయవాడలో రౌడీయిజం ఎలా ఉండేది అనే దానిపై వంగవీటి టైటిల్‌ తో వర్మ సినిమా ఇటీవల ఆడియో వేడుకను విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య కాలేజ్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహించారు. ఇక హైదరాబాద్‌ లో మంగళవారం శివ టు వంగవీటి అనే కార్యక్రమాన్ని ప్లాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, పూరి జగన్నాథ్‌, నిర్మాత పీవీపీ, నాగార్జున, వెంకటేష్‌, బోయపాటి శ్రీను, రాజశేఖర్‌ ఇలా ఇండwస్టీకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా..
ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ.. మద్రాస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ అందరికీ నమస్కారం చెప్పే అలవాటు ఉండేది. కానీ హైదరాబాద్‌కు వచ్చి వర్మగారిని కలవాలనుకున్నప్పుడు ఆయనకు నమస్కారాలు, గుడ్‌ మార్నింగ్‌లు చెప్పడం ఇష్టం ఉండదని తెలిసింది. దాంతో ఆయన్ను ఎలా పలరించాలనే దానిపై చాలా ట్రైనప్‌ అయ్యాను. రాముగారు శివతో ఎంతబాగా ఇన్‌స్పిరేషన్‌ చేశారో అందరూ చెప్పారు. ఎంతో గొప్ప సినిమాలు చేసిన ఆయన మధ్యలో ఐస్‌క్రీమ్‌ అనో, అడవి అనో ఏవేవో సినిమాలు చేస్తుంటారు. రెండు మూడేళ్ల నుండి ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. చాలా సంవత్సరాలు తర్వాత వర్మగారు వంగవీటి సినిమాను ప్రేమించి ప్రమోట్‌ చేయడానికి ముందుకొచ్చారు. అంటే వర్మ ఈజ్‌ బ్యాక్‌ అనుకోవచ్చు. వంగవీటి సాంగ్స్‌లో మరణం…పైనే వచ్చే సాంగ్‌ బావుంది. ట్రైలర్‌, సాంగ్స్‌ అన్నీ నా హృదయాన్ని తట్టాయి. టీంకు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.
విక్లరీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. సాంగ్స్‌, ట్రైలర్‌ అవుట్‌ స్టాండింగ్‌గా ఉన్నాయి. శివ తర్వాత నేను, వర్మ కలిసి సినిమా చేయాలనుకున్నప్పుడు శివలాంటి సినిమా చేస్తాడనుకున్నాను, శివ కన్నా దాని బాబులాంటి సినిమా తీస్తాడని అనుకున్నాను. కానీ నాతో క్షణ క్షణం అనే సినిమా తీశాడు. నాగ్‌ తో చెయిన్‌ లాగించాడు. నాతో కూర్చొపెట్టి సాంగ్‌ చేయించాడు. హీరోలందరూ మేమిన్నా ఫైట్స్‌ చేసినా నాగ్‌ గాడు చైన్‌ లాగి మొత్తం కొట్టేశాడని అనుకున్నాం. అలా వర్మ తనదైన స్టయిల్‌లో అందరినీ ఇన్‌స్పైర్‌ చేశాడు అన్నారు.
రామ్‌గోపాల్‌ వర్మ మట్లాడుతూ.. నా లైఫ్‌లో అమితాబ్‌, నాగార్జునగారు చాలా ఇంపార్టెంట్‌ వ్యక్తులు. నేను ఇంజనీరింగ్‌ చదివేటప్పుడు గ్రూపులో కూర్చొని సీన్స్‌ చూశాను, గాంధీ చనిపోయినప్పుడు దగ్గరలోనే ఉన్నాను. ఇలా నేను చూసిన ఘటనలను బేస్‌ చేసుకుని శివ సినిమా తీశాను. కానీ శివకు, వంగవీటికి సంబంధం లేదు. ఎందుకంటే శివ హీరోయిజమ్‌ ఉన్న కథ. వంగవీటి సినిమా తీయడానికి ఇన్ని సంవత్సరాలెందుకు పట్టిందంటే, వంగవీటి సినిమా తీయడానికి కొంత మెచ్యూరిటీ కావాలి. కొంతకాలం క్రితం జరిగిన కథ కాబట్టి వివరాలు సేకరించడానికి సమయం పట్టింది. వంగవీటిలో చిన్న రోల్‌ అయినా డిటెయిల్డ్‌గా తీశాను. ఇకపై నేను చేసే సినిమాలన్నీ హిట్‌ సినిమాలవుతాయని చెప్పను కానీ, ప్రౌడ్‌గా ఫీలయ్యే సినిమాలు చేస్తాను అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. రాము చాలా కాలంగా మంచి మిత్రుడు. తనకు నేను బ్రేక్‌ ఇచ్చాననడం నాకు నచ్చదు. మేమిద్దరం బ్రూస్‌లీ గురించి మాట్లాడుకునేవాళ్లం. చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. మా ఆలోచనలు బాగా కలిసేవేవి. తనతో సమయం గడపడానికి ఎగ్జయిట్‌ అయ్యేవాడిని. నాకు శివ అనేది లైఫ్‌ చేంజింగ్‌ మూమెంట్‌. నాకే కాదు తెలుగు సినిమాకే లైఫ్‌ చేంజింగ్‌ మూమెంట్‌. టాప్‌ 100 ఇండియన్‌ సినిమాల్లో శివ ఉంటుంది. చాలా రేర్‌గా జరిగే ఫినామినా. దాని వల్ల ప్రేక్షకుల ఆలోచనలు, ఇండwస్టీ అంతా మారుతుంది. రీసెంట్‌గా రాజమౌళి బాహుబలితో ఓ ఫినామినానకు క్రియేట్‌ చేశారు. నా లైఫ్‌లో ఉన్నందుకు రాముకు హ్యాట్సాఫ్‌. తనెలా అనుకుంటాడో అలానే జీవిస్తాడు.

ఎప్పుడూ అలానే ఉంటాడు. వర్మ చేస్తానంటేనే నేను తనతో శివ2 చేస్తాను. లేదంటే చేయను. ఇప్పటి నుండి రాము చేసే ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. వంగవీటి సినిమా చూస్తుంటే చాలా ఇన్‌టెన్స్‌గా అనిపిస్తున్నాయి. సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.