శివసేన తరఫున సియం అభ్యర్థిగా ఆదిత్య థాక్రే!

aditya thackeray
aditya thackeray

ముంబై: మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నదని సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసిన శివసేన ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగనుంది. సీట్ల పొత్తు విషయంలో సయోధ్య కుదరనందున, ఇరు పార్టీల మధ్య సియం అభ్యర్థి విషయంలో కూడా భేదాభిప్రాయాలున్నట్లు తెలుస్తుంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కూఆ దాదాపుగా ఇవే అంశాలు ముందుకు వస్తున్నాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేనే సియం అభ్యర్ధి అంటూ ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికే బిజెపి హామీ ఇచ్చిందని, ఐతే థాక్రే కుటుంబం అధినేతగా ఉండేందుకు మాత్రమే ఇష్టపడతారని సంజయ్‌ రౌత్‌ అన్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos