వ్యవసాయ సదస్సును ప్రారంభించిన చంద్రబాబు

chandra babu naidu
chandra babu naidu

గుంటూరు: గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ సదస్సును సియం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. శనివారం నుంచి పది రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆంధ్ర ,తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సుమారు రెండు వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి, సోమిరెడ్డి, ఆనందబాబు పాల్గొన్నారు.