వ్యవసాయ పథకాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అక్షయ్‌

Akshay Kumar
Akshay Kumar

న్యూఢిల్లీ: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసార పరీక్షలు, పంటల భీమా వంటి వ్యవసాయ పథకాలకు బాలీవుడ్‌ నటుడు అక్ష య్‌కుమార్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. బుల్లితెర ప్రకటనల ద్వారా ఆయా పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఆయనను ప్రచారకర్తగా నియమించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడివచారు. దీని ద్వారా రైతుల్లో అవగాహన పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే భూసార పరీక్షలకు సంబంధించిన ప్రకటన సిద్ధమైందని ,బుల్లితెరపై త్వరలో ప్రసారం కానుందని తెలిపారు. దీంతో పాటు ప్రధానమంత్రి క్రిషి సించాయి యోజన, పరంప్రగత్‌ కృషి వికాస్‌ యోజన వంటి పథకాలకు అక్షయ్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.