వృద్ధి రేటు పతనానికి కారణం నోట్ల రద్దే..

Former Governor Raghuram Rajan
Former Governor Raghuram Rajan

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు కారణంగా మన దేశ ఆర్ధిక వృద్ది భారీగా క్షీణించిందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ఆ సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పురోగతి బాటలో పయనిస్తున్నప్పటికీ డిమానిటైజేషన్‌ ప్రభావంతో భారత జిడిపి మాత్రం తిరోగమన బాట పట్టాల్సి వచ్చింది. ఓ ఆంగ్ల ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..కేవలం పెద్ద నోట్ల రద్దే కాదు జిఎస్‌టి కూడా వృద్ది రేటుకు గండి కొట్టింది.అని అన్నారు . నోట్ల రద్దు కారణంగా 2016-2017 ఆర్థిక సంవత్సరంలో వృద్ది 7.1 శాతం నుంచి , 2017-18 లో 6.7 శాతానికి దిగజారింది. జిఎస్‌టిని మరింత మెరుగ్గా అమలు చేసి ఉంటే బాగుండేదని ఆయ నఅభిప్రాయపడ్డారు. ఐదు పన్ను స్లాబులకు బదులు ఒకే స్లాబు ఉండేలా అనేది చర్చనీయాంశమని అన్నారు.