వీరే టిఆర్‌ఎస్‌ ‘పెద్దలు’

TRS CANDIDATES
TRS CANDIDATES

వీరే టిఆర్‌ఎస్‌ ‘పెద్దలు’

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం ప్రకటించారు.టిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్‌, పార్టీ నేతలు బడు గుల లింగయ్య యాదవ్‌, బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌లను ఎంపిక చేసి నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆరె సెల్పీ సమావేశంలో అభ్యర్థులను నిర్ణయించారు. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల దాఖలుకు 12వ తేదీ ఆఖరు గడువు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముగ్గురు సోమ వారం ఉదయం అసెంబ్లీ ముందు ఉన్న అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ నర్సింహాచా ర్యులు వద్ద నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

మూడింటికి మూడుస్థానాలు టిఆర్‌ఎస్‌ గెలిచే బలం ఉంది. ఒక్కో అభ్యర్థికి కనీసంగా 30ఓట్లు కావాల్సి ఉంటుంది.టిఆర్‌ఎస్‌కు వలసవచ్చిన వారితో కలిసి 92 వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎరైనా పోటీ చేస్తే ఈనెల 23న పోలింగ్‌ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. అలుపెరుగని సైనికుడు సంతోష్‌కుమార్‌ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమ నేత కెసిఆర్‌ గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు.

చీకటి వెలుగులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కెసిఆర్‌ వెన్నంటి నడిచిన వ్యక్తి. తెలంగాణ మలి దశ ఉద్యమంలో అలుపె రగని సైనికుడు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజక వర్గం బోయన్‌పల్లి మండలం కొదురుపాక గ్రామంలో 1976 డిసెం బర్‌ 7న సంతోష్‌కుమార్‌ జన్మించారు.