వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా గుర్మీత్ ను విచారించ‌నున్న కోర్టు

Gurmeet singh
Gurmeet singh

పంచ‌కులః సిర్సాకు చెందిన పాత్రికేయుడు రామ్‌ చందర్‌ ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్యల్లో
ప్రధాన కుట్రదారుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నా డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను
మరికొద్దిసేపట్లో పంచకుల న్యాయస్థానం విచారించనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ విచారణకు
గుర్మీత్‌ హాజరుకానున్నారు. శాంతి, భద్రతల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గుర్మీత్‌ను వీడియో కాన్ఫరెన్స్‌
ద్వారా విచారించాల్సిందిగా పంచకుల డీసీపీ మహబీర్‌ సింగ్‌ న్యాయస్థానాన్ని కోరారు. ఆయన అభ్యర్థను పరిగణలోకి
తీసుకున్న సీబీఐ న్యాయమూర్తి జగ్దీప్‌ సింగ్‌ అనుమతి మంజూరు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఎటువంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హరియాణా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పారామిలటరీ
బలగాలు, హరియాణా పోలీసులు పంచకులలో భారీ ఎత్తున మోహరించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ బీఎస్‌ సంధు వెల్లడించారు.