విశాఖలో 24 అన్న క్యాంటీన్లు

Narayana
Narayana

విశాఖలో 24 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ నగరపాలక సంస్థ అభివృద్దిపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. కేవలం రూ.5లతో పేదలకు ఆకలి తీర్చే యోచనలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ మున్సిపల్ పాఠశాలలో మంచి వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు మించి ఫలితాలు సాధిస్తున్నామన్నారు.