విమర్శల వర్షం

Revanth Reddy
Revanth Reddy

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కామెంట్స్‌పై రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ఫైరయ్యారు. పలు సామెతలను గుర్తు చేస్తూ కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయన్నారు. లక్ష్మారెడ్డి లాంటి వారిని సమర్ధించడంతోనే టీఆర్‌ఎస్‌ సంస్కృతి ఏంటో అర్థమవుతోందన్నారు. కేటీఆర్‌ తనపై వ్యాఖ్యానించే ముందు లక్ష్మారెడ్డి ఏం మాట్లాడాడో చూస్తే మంచిదన్నారు. లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకున్నాక.. నా గురించి మాట్లాడాలన్నారు.