విమర్శలను పట్టించుకోను!

RAASI KANNA
RAASI KANNA

విమర్శలను పట్టించుకోను!

ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనని రాశి ఖన్నా అంటోంది. అయితే ఆమె ఈ మాటలు అన్నది కాస్తంత అహంభావంతో కాదు, తన లోపాలేంటో తనకి తెలుసంటూ ఆ మాట అందంతే. సినిమా విడుదల కాగానే రకరకాల కామెంట్లు వింటూ వుండటం తనకి అలవాటేనని ఆమె చెప్పింది. చాలా బాగా చేశావని కొంతమంది.. ఇంకాస్త బెటర్‌ గా చేసి ఉంటే బాగుండేదని మరి కొంతమంది అంటూ ఉంటారని అంది. ఆ కామెంట్లను తాను ఎంత మాత్రం పట్టించుకోననీ, తాను ఏ స్థాయిలో నటించింది తనకి తెలిసిపోతూనే వుంటుందని చెప్పింది. నటన విషయంలో తనకి తాను ఎప్పుడూ తక్కువ మార్కులే ఇచ్చుకుంటూ ఉంటానని అంది. రీసెంట్‌ గా హైపర్‌ సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం గోపీచంద్‌ నటిస్తోన్న ఆక్సిజన్‌ సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తోంది.