విమర్శనాస్త్రాలతో విపక్షాలు సిద్ధం

parliamentfff

విమర్శనాస్త్రాలతో విపక్షాలు సిద్ధం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారంప్రారంభం కానున్నాయి.. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పునరుద్ధరించిన సుప్రీం కోర్టు తీర్పు, జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనలు, ఎన్‌ఎస్‌జి సభ్యత్వం విషయంలో ఎదరైన భంగపాటు, కామల్‌ సివిల్‌ కోడ్‌ అమలుకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఒ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. దీంతో ఈ సమావేశాలు అత్యంత వాడి వేడిగా కొనసాగేసూచనలు కన్పిస్తున్నాయి.