విభజన హామీలపై అవసరమైతే కోర్టుకు.

TDP MPs
TDP MPs

విభజన హామీలపై అవసరమైతే కోర్టుకు.

దశలవారీగా పోరాటం తీవ్రతరం.. అన్ని పార్టీలకు లేఖలు రాస్తాం
పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం.. తెలుగుదేశం పార్టీ ఎంపిలు

అమరావతి: రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్‌ సమావేశంలో మాట్లాడమని, టీడీపీ సభ్యుల మంతా ముక్తకంఠంతో ప్రజల ఆవేదనను తెలి పామని టీడీపీ తోట నరసింహం అన్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసం ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో తెలుగుదేశం పార్లీ మెంటరీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సుదీర్ఘంగా కొనసాగింది.

ఈ సమావేశం అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ పార్లమెంట్‌ సమావేశాలు ఆఖరిరోజున అరుణ్‌జైట్లీ, అమిత్‌షా, సుజనా చౌదరి వీరంతా కలిసి కూర్చొని విధివిధా నాలపై చర్చించారన్నారు. 15రోజుల సమ యం అనుకున్నాం. అయిన ఈరోజు వరకు కేంద్రం నుంచి ఏపీకి నిధుల కేటాయింపులు, ఇతర అంశాల్లో సాయం చేసిన పరిస్ధితి కన బడటంలేదన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రజల ఆవేదనను వ్యక్తీక రించామని దానిలో భాగంగా ఏపీకి రావాల్సి నవన్నీ కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు.

హేతుబద్ధతలేని విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అప్పట్లో కాంగ్రెస్‌ విభజిం చింది. బిజెపి మద్ధతు ఇచ్చిందన్నారు. అందు వల్ల ఇద్దరూ కలిపి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమో దించారన్నారు. ఆ రోజు చేసిన వాగ్ధానాలు, పునర్విభజన బిల్లులో అంశాలను నెరవేర్చేం దుకు ఎలాంటి నిధులూ ఇవ్వలేదన్నారు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా అడుగు తున్నామని తెలిపారు. 2014నుంచి కూడా చట్టసభలో ప్రత్యేకహోదా నినాదంతో ముందు కళ్లాం, ఏపీకి హోదా కాకుండా ప్రత్యేక సాయం చేస్తామన్నారు. దానికి సంబంధించిన విధానం ఈ రోజు వరకు ప్రకటించలేదన్నారు. తెలుగు ప్రజల ఆవేదనలో భాగంగా అన్ని అం శాలను అమలు చేయాలనేది మా పార్టీ ఎంపీలు, ప్రభు త్వ డిమాండ్‌. మేమంతా దీనిపై పోరాడాలని నిర్ణయిం తీసుకున్నామన్నారు.ఈ నెల 5న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఈ లోగా ఏ రక మైన విధివి ధానాలు, సాయం వచ్చే అవకాశం కనబటం లేదని, 5న మరోసారి పార్లమెంట్‌ను స్తంభింప జేయడమే కాకుండా సభలో కేంద్రాన్ని నిలదీ యాలని నిర్ణంచామని తెలిపారు.

కార్యాచరణ ప్రణాళిక పెట్టుకున్నామని, సీఎం సలహాలు, సూచనలతో సభలో గట్టిగా నినా దాలు, నిరస నలు చేపడతామని అన్నారు. అవసరమైతే కోర్టు వెళ్తాం: ఎంపీ గల్లా జయదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన నాలుగేళ్లు గడిచిందని నాలుగో బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింద న్నారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని పార్లమెంట్‌లో మేం ఏం మాట్లాడామో ప్రజ లంతా చూశారని తెలిపారు. ఆర్ధికబిల్లు ముందే టేబుల్‌ చేశారు.