విప‌క్షాల అభ్య‌ర్థికే మా మ‌ద్ద‌తు

TDP MP'S
TDP MP’S

న్యూఢిల్లీః రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చౌదరి తెలిపారు. ఈ మేరకు హరిప్రసాద్‌కు మద్దతుగా తమ పార్టీ ఎంపీలు ఓటేస్తారని చెప్పారు. బీకే హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పోటీ చేస్తున్నారు.