విదేశాంగ మంత్రులతో న్యూయార్క్‌లో భేటీ

 

Sushma Swaraj
Sushma Swaraj

విదేశాంగ మంత్రులతో న్యూయార్క్‌లో భేటీ 

న్యూయార్క్‌: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ న్యూయార్క్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 23న జరిగే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో పాల్గొనేందుకు న్యూయార్క్‌ వెళ్లిన సుష్మా అక్కడ వివిధ దేశాల అధ్యక్షులు, విదేశీ వ్యవహారాల మంత్రులతో వరుసగా భేటీలు అయ్యారు. బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనాతో సుష్మా సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత్‌ సందర్శించనున్న ఇవాంకా ట్రంప్‌తో చర్చించారు. మహిళా సాధికారితపై సుష్మాస్వరాజ్‌తో ఇవాంకా చర్చించారు. యూఏఈ, లాత్వియా విదేశాంగ మంత్రులతో సుష్మా భేటీ అయ్యారు.