వాషింగ్టన్‌కు తరలించనున్నా బుష్‌ భౌతికకాయం

BUSH
BUSH

హ్యూస్టన్‌: ఆనారోగ్యంతో కన్నుమూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌ డబ్ల్యూ బుష్‌ పార్థిదేహాన్ని వాషింగ్టన్‌కు తరలించానున్నారు. ఆదేశ అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో సీనియర్‌ బుష్‌ భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఇప్పటికే హ్యూస్టన్‌కు చేరుకుంది. ప్రజల సందర్శనార్థం సీనియర్‌ బుష్‌ పార్థివదేహాన్ని వాషింగ్టన్‌లోని కాపిటల్‌ రోటుండాలో ఉంచుతారు. ఈరోజు సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ప్రజలు ఆయనకు నివాళులర్పించొచ్చని అధికారులు తెలిపారు. అనంతరం బుధవారం మధ్యాహ్నం బుష్‌ భౌతికకాయాన్ని తిరిగి హ్యూస్టన్‌ తీసుకెళ్లనున్నారు. అక్కడ గురువారం ఉదయం వరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం గురువారం మధ్యాహ్నం టెక్సాస్‌లోని భార్య బార్బరా, కుమార్తె రాబిన్‌ సమాధుల పక్కనే బుష్‌ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు అధ్యక్షుడు ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా హాజరుకానున్నారు.