వాయుకాలుష్యంతో క్రికెటర్ల ఉక్కిరిబిక్కిరి

SRILANKA TEAM
SRILANKA TEAM

This slideshow requires JavaScript.

వాయుకాలుష్యంతో క్రికెటర్ల ఉక్కిరిబిక్కిరి

ఢిల్లీ: గాలిలో ఆక్సిజన్‌శాతం తగ్గి కాలుష్యం మోతాదు పెరగటంతో భారత్‌ శ్రీలంక జట్ల మధ్య మూడో మ్యాచ్‌ రెండో రోజు ఆటలో కొంత విరామం ఏర్పడింది.. దీంతో కాసేపటి తర్వాత శ్రీలంక క్రికెటర్లు ముక్కులకు మాస్కులు ధరించి ఫీల్డ్‌లోకి వచ్చారు.. అంతేకాకుండా తాము ఈ పరిస్థితుల్లో ఆడలేమంటూ పట్టుబట్టారు.. ఇదే విషయమై పోఠాన్‌ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు..

వాంతులు చేసుకున్న పలువురు క్రికెటర్లు

ఉదయం మ్యాచ్‌ జరుగుతుండగానే ఒక దశలో ఫీల్డ్‌లో ఉన్న సభ్యులు చాలా ఇబ్బందులకు లోనయ్యారు. కాగా డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వచ్చేసి పలువురు వాంతులు చేసుకున్నారు.. ఈసందర్భంగా శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండీమాల్‌ మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితుల్లో మేం క్రికెట్‌ ఆడాలి.. అసలు ఆడాలనే ఉంది.. అయితే తమ జట్టు సభ్యులు భద్రత కోల్పోతున్నామన్నారు.. ఫీల్డింగ్‌ చేయటానికి మైదానం అనుకూలంగా లేదని పేర్కొన్నారు.. మా దృష్టిలో ఇదో ప్రత్యేక మైన కేసు అంటూ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ:భారత్‌, శ్రీలంక జట్ల సభ్యులకు మంగళవారం ఫీల్డ్‌లోనే శ్వాసతీసుకోవటానికి చాలా ఇబ్బందులు పడ్డారు.. వాయుకాలుష్యంకారణంగా పలువురు అస్వస్థకు లోనవటం విచారకరం.. భారత బౌలర్‌ మహ్మద్‌ షమి మైదానంలోనే వాంతులు చేసుకున్నాడు.. 6వ ఓవర్‌ వేస్తున్న షమీ బౌలింగ్‌ చేస్తుండగానే ఫీల్డ్‌లోనే వాంతి చేసుకున్నాడు.. కాసేపటికి కుదుటపడి ఆ ఓవర్‌ పూర్తిచేశాడు.. తన ఓవర్‌ పూర్తవ్వగానే షమీ అంపైర్‌కు చెప్పి మైదానం నుంచి వెనుదిరిగాడు.