వరుణ్‌ మెగా కుటుంబం గర్వపడే సినిమా చేశాడు: చిరంజీవి

TOLI PREMA
TOLI PREMA

వరుణ్‌ మెగా కుటుంబం గర్వపడే సినిమా చేశాడు: చిరంజీవి

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘తొలిప్రేమ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈసందర్భంగా శుక్రవారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి చిత్రం యూనిట్‌ సభ్యులుహీరో వరుణ్‌తేజ్‌, దర్శకుడు వెంకీ , నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ , బాపినీడులను హైదరాబాద్‌లో తన ఇంటికి ఆహ్వానించి సన్మానించారు.. అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడారు.. తొలిప్రేమ పెద్ద సక్సెస్‌ అయిన సందర్భంగా టీమ్‌ అందరికీ అభినందనలు అన్నారు . తనసోదరుడు పవన్‌ చిత్రం తొలిప్రేమ టైటిల్‌తో వచ్చిన ఈసినిమా అని చాలా క్యూరియాసిటీ కల్గిందన్నారు. ఇదొక కాంటెప్రరరీ లవ్‌స్టోరీ అన్నారు. కథ కన్నా సిచ్యువేషన్‌ గానేసినిమాఅంతా ఉంటుందన్నారు. ఇలా సినిమా చేయటం డైరెక్టర్‌కి చాలా పెద్ద ఛాలెంజింగ్‌ అన్నారు. ఓ కొత్త కోణంలోసినిమాను చూపించారన్నారు. ఇలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావాలన్నారు. వరుణ్‌తేజ్‌ చాలా మెచ్యూర్డ్‌గా నటించాడని అన్నారు.. సినిమాలో తనను చూస్తున్నంతసేపు ఎవరో యంగ్‌ బో§్‌ు నటిస్తున్నట్టు అన్పించిందన్నారు. ప్రేమ సన్నివేశాలు., ఇగో క్లాషెస్‌ సన్నివేశాల్లో వరుణ్‌, రాశిఖన్నాల చాలా ఇన్వాల్వ్‌ అయి చేశారన్నారు. వరుణ్‌ పెర్ఫామెన్స్‌ చూసి తమ కుటుంబం అంతా గర్వపడుతోందన్నారు..
దర్శకుడు మాట్లాడâత, చిన్నపుడు స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్‌ సినిమా టైమ్‌లోనే చిరంజీవిగారిని చూశానని, మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవిగారి పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం కల్గిందన్నారు.. ఈ అనుభూతి ఎప్పటికీ మరువలేనని అన్నారు.. నిర్మాత ప్రసాద్‌ మాట్లాడుతూ, 33 ఏళ్ల క్రితం సినిమాల చేద్దామని మద్రాసు వెళ్లానని అన్నారు. ఆ సమయంలో పసుపులేటి రామారావుగారు ద్వారా చిరంజీవిగారి ఇంటికి వెళ్లటం జరిగిందన్నారు. నిర్మాతకన్నా ..అక్కడ ఓ అభిమానిగానే చిరంజీవిగారితో పరిచయం జరిగిందన్నారు.. ఇన్నేళకు రామ్‌చరణ్‌, పవన్‌కల్యాణ్‌, బన్నీ ఇపుడు వరుణ్‌తో సినిమాలు చేసే అవకాశం లభించిందన్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు.. కార్యక్రమంలో వరుణ్‌తేజ్‌,. థమన్‌ తదితరులు మాట్లాడారు.