వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బిఐ

SBI
SBI

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సోమవారం నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. జనరల్‌, సీనియర్‌ సిటిజన్స్‌ కేటగిరీలు రెండింట్లోనూ వివిధ మొత్తాలు, డిపాజిట్‌ కాల వ్యవధులను బట్టి వడ్డీ రేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు డిపాజిట్లు ఏడాది నుంచి పదేళ్ల కాల వ్యవధిలో ఉన్న వాటికి 5 నుంచి పది బేసిస్‌ పాయింట్లు పెంచింది. అంటే 0.05 శాతం నుంచి 0.1 శాతం వరకు వడ్డీరేట్లు పెరిగాయి. ఏడాదిలోపు డిపాజిట్లపై గతంలో ఉన్న వడ్డీరేట్లే కొనసాగుతాయి. ఏడాది నుంచి రెండేళ్ల వరకు గతంలో ఉన్న 6.65 శాతం వడ్డీరేటు ఇక నుంచి 6.7 శాతంగా.. 2నుంచి 3 ఏళ్ల మధ్య ఉన్న డిపాజిట్లకు 6.75 శాతంగా ఉండనుంది. ఇక మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు డిపాజిట్లపై గతంలో 6.7 శాతంగా ఉన్న వడ్డీ రేట్లు 6.8 శాతానికి చేరింది.