వచ్చే ఎన్నికల్లో భాజపా, తెరాసలు కలిసి పోటీ చేయనున్నాయి?: జైపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

jaipal reddy
jaipal reddy

హైదరాబాద్‌: సోమవారం శంషాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి భాజపా, అర్‌ఎస్‌ఎస్‌లు
అత్యంత ప్రమాదకరమైనవని, అర్‌ఎస్‌ఎస్‌కు ఏ మాత్రం పారదర్శకత ఉండదని, అబద్దాలను అందంగా చెప్పడంలో తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్‌ను మించిన వారు లేరని విమర్శించారు. అబద్దాలు చెప్పడానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు పోటీపడుతున్నారని, రానున్న
ఎన్నికల్లో భాజపాతో కలిసి కేసీఆర్‌ పోటీ చేయబోతున్నారని అన్నారు. ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు, పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను
కట్టిస్తామంటూ ప్రజలను కేసీఆర్‌ మభ్యపెట్టారని, కేసీఆర్‌ ఇంటింటీకి నీళ్లను ఇవ్వడం సాధ్యం కాదని, దీంతో వచ్చే ఎన్నికల్లో ఓట్లనూ అడగలేరని
తీవ్ర స్థాయిలో విమర్శించారు.