లోక్‌సభకు 40 స్థానాల్లో పోటి చేస్తాం

Kamal hassan
Kamal hassan

చెన్నై: సినినటుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్‌ పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతోపాటు అక్కడి సమస్యలు తెలుసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు కోయంబత్తూరు, ఈరోడ్‌ జిల్లాల్లో పర్యటన నిర్వహించారు. బుధవారం ఈరోడ్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలో ఉన్న మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుంద తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉంటాయన్న కమల్‌ వ్యాఖ్యలు, ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై పలువురు ఆరా తీయగా కమల్‌ స్పందించారు. రాష్ట్రంలోని కొన్ని పార్టీలు గెలుపుపై అతి విశ్వాసంతో ఉన్నాయని విమర్శించారు. అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడం ద్వారా ఆ పార్టీలను షాక్‌ ఇస్తామన్నారు. పార్టీని ప్రారంభించినప్పుడు జెండా, అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కనీసం ఐదేళ్లు అయినా పడుతుందని అనుకున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత ప్రజల స్పందన చూస్తే ఏడాదికే అందరికి చేరువ అయ్యామని తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌, ప్రధాన కార్యదర్శి అరుణాచలం తదితరులు పాల్గొన్నారు.