లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలి

anna hajare
anna hajare

హైదరాబాద్‌: హెచ్‌ఐసిసిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సును ఇవాళ జాగృతి అధ్యక్షురాలు కవిత, అన్నాహజారే కలిసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నాహజారే మాట్లాడుతూ ..నిర్ధిష్ట సమయం ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని చెప్పారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకూడదని, నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలని, ప్రజలకు సేవ చేసేందుకే మనిల్ని దేవుడు ఇక్కడికి పంపాడు అని యువత నుద్దేశించి మాట్లాడారు.