లండన్‌లో త్రిష కొత్త సినిమా ప్రారంభం

tttttttt

లండన్‌లో త్రిష కొత్త సినిమా ప్రారంభం

అందాల తార త్రిష తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు గోవి దర్శకత్వంలో హర్రర్‌ చిత్రంగా వస్తున్న నాయకి సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే..ఈసినిమా విడుదల నుంచే త్రిష మధురై ఫేం ఆర్‌ మాదేవ్‌ దర్శకత్వంలో మరో హర్రర్‌ సినిమా చేయటానికి అంగీకరించిన విషయం తెలిసిందే.
మోహినిగా రాబోతున్న ఈసినిమా షూటింగ్‌ గురువారం లండన్‌లో మొదలైంది.. 40 రోజులపాటు లండన్‌లోనే ఈ మొదటి షెడ్యూల్‌లో సినిమాలో కీలకసన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిసింది. ఈసినిమాలో గ్రాఫిక్స్‌కు ఎక్కువప్రాధాన్యం ఉన్నట్టుతెలుస్తోంది. హారీపోట్టర్‌ చిత్రానికి గ్రాఫిక్స్‌ సమకూర్చిన విఎఫ్‌ఎక్స్‌ బృందం మోహిని చిత్రానికి పనిచేస్తుండటం విశేషం.. ఈసినిమాకు మెర్విన్‌ పోలమన్‌, వివేక్‌ సంగీతం అందిస్తుండగా, ఆర్‌బి గురుదేవ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.