రైలు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికై ఓ యాప్‌!

rail madad app
rail madad app

హైదరాబాద్‌: ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేలా సరికొత్త మార్పులకు నాంది పలుకుతున్న భారతీయ రైల్వే మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘రైల్‌ మదద్‌’ పేరుతో మొబైల్‌ యాప్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలులో ప్రయాణించేవారు ఈ యాప్‌ సాయంతో తమకు ఎదురైన సమస్యలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై సంబంధిత సమాచారం పొందే వీలుంటుంది. ఇప్పటికే వివిధ హెల్స్‌లైన్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.