రేపు కెటిఆర్‌ చేతుల మీదుగా ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌

 

charan move
charan move

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘వినయ విధేయ రామ’ట్రైలర్‌ను తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈవిషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. రేపు యూసఫ్‌గూడలోని పోలిస్‌ గ్రౌండ్స్‌లో ఆట్టహాసంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.