రెండు దేశాల మ‌ధ్య బంధం మ‌రింత బ‌లోపేతం

white house
white house

అమెరికా: డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో భారత్‌-అమెరికా బంధం మరింత మెరుగైందని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ఆర్థిక రంగం, ఉగ్రవాదంపై పోరు తదితర అంశాలలో పరస్పర సహకారం మెరుగైందని వ్యాఖ్యానించారు. మనీలాలో మోదీ, ట్రంప్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపిన నేపథ్యంలో భారత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన శ్వేతసౌధం అధికారి రాజ్‌షా ఇప్పటికే భారత్‌-అమెరికా మధ్య బలమైన బంధం ఉందని అది మరింత శక్తిమంతమౌతుందని వ్యాఖ్యానించారు. అమెరికా- చైనా కంటే అమెరికా- భారత్‌ మధ్య ఎక్కువ సారుప్యాలున్నాయని ఆయన వెల్లడించారు. ప్రధాని మోది పనితీరుతో ఎక్కువ ఆకట్టుకున్నారని ఇరువురు పరస్పరం ఇష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు.