రూ.5కోట్లకు చేరిన మార్కెట్‌

NAYANATARA
NAYANATARA

రూ.5కోట్లకు చేరిన మార్కెట్‌

తమిళంతోపాటు తెలుగులోకూడ మలయాళ బ్యూటీ నయనతార నటించిన కర్తవ్యం హిఠ్‌ కావటంతో ఆమెను లేడీ సూపర్‌స్టార్‌ అంటూ అభిమానులు పొగిడేస్తున్న సంగతి తెలిసిందే.. తమిళంతోపాటు తెలుగు, మలయాళంలో కూడ నయనతారకుమంచి డిమాండ్‌ ఏర్పడింది.. వాస్తవానికి , శ్రీరామరాజ్యం సినిమా తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పేద్దామనుకున్న నయనతార..ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నయనతార వరుసహిట్లతో దూసుకుపోతోంది.. కొద్దిరోజుల క్రితం వరకు సినిమాకు రూ.2 కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ను డిమాండ్‌ చేసిందట.. తాజా సమాచారం ప్రకారం నయన్‌ ఓ సినిమాకు రూ.5కోట్లు వరకు పారితోషికం అందుకుదని ఓ తమిళ నిర్మాత వెల్లడించినట్టు తెలిసింది.