రియల్ టైమ్ గవర్నెన్స్ –కాల్ సెంటర్ 1100 పరిష్కార వేదిక

AP CM Chandrabbau Naidu
AP CM Chandrabbau Naidu

రియల్ టైమ్ గవర్నెన్స్–కాల్ సెంటర్ 1100 పరిష్కార వేదిక

• కాల్ సెంటర్ 1100 పరిష్కార వేదిక ప్రారంభించి ఇప్పటికి 4నెలలు అవుతోంది. ఏప్రిల్ 21న ప్రారంభించారు. మే 2వ వారం నుంచి పూర్తిస్థాయిలో పని చేస్తోంది.
• ఎప్పటికప్పుడు వివిధ అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడం, ఆ సమాచారం సంబంధిత శాఖలకు పంపడం, ప్రజల ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా చూడటం, ఆ సమాచారం ఫిర్యాదుదారులకు ఇవ్వడం ఒక పద్దతి ప్రకారం జరుగుతోంది.
• ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక వారధిగా కాల్ సెంటర్ 1100 పరిష్కార వేదిక పనిచేస్తోంది. దీనిని సక్రమంగా వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. ఇక్కడ నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం అధికార యంత్రాంగం కర్తవ్యం.
• ఈవారం కాల్ సెంటర్ చేసిన అభిప్రాయ సేకరణ, అందులో వెల్లడైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.ఉచిత ఇసుక విధానంపై సమీక్ష :

ఉచిత ఇసుక విధానంపై కాల్ సెంటర్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించి,  కేబినెట్ సమీక్షించి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
1).రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు ఇవ్వడానికి ముందు ఇసుక అమ్మకాలపై కాల్ సెంటర్ తీసుకున్న అభిప్రాయ సేకరణలో ప్రజల్లో అసంతృప్తి 53%వరకుఉంది.
2).రాష్ట్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు ఇచ్చి కఠినంగా అమలు చేయడం ప్రారంభించాక ప్రజల్లో అసంతృప్తి గణనీయంగా తగ్గింది. ఇసుక విధానంపై 82% మంది  ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడమే అందుకు ఉదాహరణ. కేవలం 18%మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు.
3). సర్వే ద్వారా ఇంకా దృష్టి సారించాల్సిన జిల్లాలు:  తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కడప.
4).సమర్ధవంతంగా, పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు పరుచుటకు మైనింగ్ డిపార్ట్ మెంట్ మరియు రియల్ టైం గవర్నెన్స్ డిపార్ట్ మెంట్ లను అనుసంధానం చేయడం జరిగింది. ఏ ఫిర్యాదు ఉన్నా వినియోగదారులు కాల్ సెంటర్ 1100 నెంబర్ కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు.
5).సమగ్రంగా సమాచారం సేకరించేందుకు రియల్ స్టేట్ రంగానికి చెందిన క్రిడాయ్ లాంటి సంస్థలు, పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ ప్లానింగ్)తో సంప్రదించడం జరిగింది.
6).జిల్లాలవారీగా మరియు వివిధ పట్టణాలు, నగరాల్లో ధరల వ్యత్యాసాన్ని పరిశీలించడం జరిగింది.
• ఇసుక ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అభిప్రాయం: 74% మంది బాగుందని అన్నారు.20% బాగాలేదనగా, 6% తెలియదు అన్నారు.
• ఎందుకు బాగాలేదు..? అమలు పరచడంలో లోపాలు ఉన్నాయా, ఇసుక మాఫియాను అరికట్టలేదా,ధరలు నిర్ణయించడంలో పారదర్శకత లేదా, ధరల స్థిరీకరణ చేయలేదా…అని ప్రశ్నించి అభిప్రాయాలు రాబట్టడం జరిగింది.
• ధరల నియంత్రణకు జిల్లా స్థాయిలో అధికారులతో సమన్వయ కమిటిలు వేయడంపై అభిప్రాయం అడగగా, బాగుందని 84%, బాగాలేదని 13%, తెలియదని 3% అన్నారు.
• ఎందుకు బాగాలేదని అడగగా అమలు పరచడంలో లోపాలు ఉన్నాయా? రాజకీయ నాయకుల అండతో ఇసుక రవాణా జరుగుతోందా? ధరలను నిర్ణయించడంలో పారదర్శకత లేదా? ఇసుక మాఫియాను అరికట్టటం లేదా? తదితర ప్రశ్నలతో వారి అభిప్రాయాలు సేకరించడం జరిగింది.
• ఇసుక అక్రమ రవాణాను అరికడితే ధరలు తగ్గుతాయని భావిస్తున్నారా అని అడిగితే 91%మంది అవును అని, 7%మంది లేదు అని, 1% తెలియదని అన్నారు.
• మీరు ఏవిధమైన రవాణా ద్వారా ఇసుక పొందారు అని ప్రశ్నించగా 70% లారీ ద్వారా అని, 30% ట్రాక్టర్ ద్వారా అని జవాబిచ్చారు.
టౌన్ ప్లానింగ్ డేటాబేస్  ద్వారా సేకరణ:
• ఇసుక ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అభిప్రాయం అడగగా 69% బాగుందని, 31% బాగాలేదని అన్నారు.
• ఎందుకు బాగాలేదని అడగగా ఇసుక మాఫియాను అరికట్టలేదా, ధరలు నిర్ణయించడంలో పారదర్శకత లేదా, ఇసుక ధరల స్థిరీకరణ చేయలేదా అని ప్రశ్నించి వారి అభిప్రాయాలు సేకరించడం జరిగింది.
• ధరల నియంత్రణకు జిల్లా స్థాయిలో అధికారులతో సమన్వయ కమిటిలు వేయడంపై అభిప్రాయం అడగగా, బాగుందని 78%, బాగాలేదని 22% అన్నారు.
• మీరు ఏవిధమైన రవాణా ద్వారా ఇసుక పొందారు అని ప్రశ్నించగా 30% లారీ ద్వారా అని, 70% ట్రాక్టర్ ద్వారా అని జవాబిచ్చారు.
• ఇసుక అక్రమ రవాణా అరికడితే ధరలు తగ్గుతాయని భావిస్తున్నారా అని అడిగితే 93%మంది అవును అని, 7% తెలియదని అన్నారు.
క్రెడాయ్ డేటాబేస్ ద్వారా సేకరణ :
• ఇసుకధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అభిప్రాయం అడిగితే 52%బాగుందని, 48%బాగాలేదని అన్నారు.
• ఎందుకు బాగాలేదు?అమలు పరచడంలో లోపాలు ఉన్నాయా, ఇసుక మాఫియాను అరికట్టలేదా,ధరలు నిర్ణయించడంలో పారదర్శకత లేదా,ఇసుక ధరలు స్థిరీకరణ చేయలేదా అనికూడా ప్రశ్నించి వారినుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది.
• ఇసుక అక్రమ రవాణాను అరికడితే ధరలు తగ్గుతాయని భావిస్తున్నారా అని అడిగితే 93% అవును అని, 7% లేదు అని అన్నారు.
• ఇసుక ధరలను నియంత్రించేందుకు జిల్లాల స్థాయిలో అధికారులతో సమన్వయ కమిటీలు వేయడంపై మీ అభిప్రాయం అడిగితే 70% బాగుంది అని, 30% బాగాలేదు అని తెలిపారు.
• ఇసుక అక్రమ రవాణాను అరికడితే ధరలు తగ్గుతాయని భావిస్తున్నారా అని అడిగితే, 90% అవును అని, 10% లేదు అని తెలిపారు.
• మీరు ఏవిధమైన రవాణా ద్వారా ఇసుక పొందారు అని అడిగితే 67% లారీ ద్వారా అని, 33% ట్రాక్టర్ ద్వారా అని చెప్పారు.
మరిన్ని కఠిన చర్యలు:
ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు చేపడుతోంది.
1).సిసి టివి సర్వైలెన్స్, మొబైల్ చెక్ పోస్ట్ ల ఏర్పాటు
2).కాల్ సెంటర్ కు ఫిర్యాదులు,ప్రతి వినియోగదారుడి నుంచి ఎప్పటికప్పుడు సమాచార సేకరణ,
3).ఇసుక రీచ్ ల వద్ద రవాణా కట్టుదిట్టం చేయడం, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్టమైన నిఘా…తదితర చర్యలను తీసుకుంటోంది.
ఉచిత ఇసుక విధానం ద్వారా అంతిమంగా వినియోగదారులకే మేలు చేకూరాలన్నదే రాష్ట్రప్రభుత్వ విధానం. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, ధరల స్థిరీకరణ, పటిష్టమైన నిఘా, రవాణా కట్టుదిట్టం చేయడం తదితర చర్యలు తీసుకుంటున్నాం.

2.మద్యం విధానం/బెల్ట్ షాపులపై అభిప్రాయ సేకరణ:

• ప్రభుత్వం బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడానికి ముందు, ప్రజల్లో 59% అసంతృప్తి ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
• ఇప్పుడు బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించడంపై ప్రజల్లో 89.4% సంతృప్తి కనిపించింది.
1).మొత్తం 4,18,322 మందికి ఫోన్ చేయగా, 89,605 మంది స్పందించారు. వారిలో 44,953 మంది అభిప్రాయాలు వెల్లడించారు.
2).బెల్ట్ షాపులు మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై 98%మంది సరైన నిర్ణయమని సమర్ధించారు.
3).ప్రభుత్వం బెల్ట్ షాపుల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై 88% సంతృప్తి వ్యక్తం చేశారు.
4).మద్యం అమ్మకాలను రాత్రి 11గం. నుంచి 10గం.వరకే కుదించడాన్ని 87% మంది సమర్ధించారు.
5).నివాస ప్రాంతాల వద్ద మద్యం దుకాణాలు తొలగించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని 94% మంది తెలిపారు.
6). బెల్ట్ షాపులను మూసివేయమని ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు తమకు తెలుసు అని 71% మంది తెలిపారు.
7).బెల్ట్ షాపులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు ప్రస్తుత మద్యం విధానంపై అసంతృప్తి వ్యక్తపరిచిన 2,437మందిలో ఇంకా నివాస గృహాల వద్ద మద్యం దుకాణాలు నియంత్రించాలి అని 70% మంది అన్నారు.
8).కాల్ సెంటర్ 1100 నెంబర్ కు ఇప్పటివరకు అందిన ఫిర్యాదుల ప్రకారం 2,142 బెల్ట్ షాపులను తొలగించడం జరిగింది.
సర్వే ప్రకారం ఇంకా దృష్టి సారించాల్సిన జిల్లాలు: చిత్తూరు, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి
• ఒక ప్రత్యేక యాప్ ను డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా ఎవరైనా 1100 నెంబర్ కు ఫిర్యాదు చేస్తే తక్షణమే ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఆ ఫిర్యాదును పంపించి దానిపై చర్యలను తిరిగి ఫిర్యాదుదారుడికి చెప్పడం కూడా జరుగుతుంది.
• కాల్ సెంటర్ కు అందుతున్న ఫిర్యాదులు, వాటిపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో బెల్ట్ షాపుల బెడద గణనీయంగా తగ్గింది.
• అందుతున్న సమాచారం ప్రకారం కొందరు అక్రమ వ్యాపారులు  మొబైల్ షాపుల (స్కూటర్లు, మోటార్ సైకిళ్లు) ద్వారా మద్యం అక్రమ అమ్మకాలకు పాల్పడుతున్నట్లు తెలిసి, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ‘‘మొబైల్ రెయిడింగ్ పార్టీలను’’ ఏర్పాటు చేసి వారిపై కూడా ఉక్కుపాదం మోపుతోంది.
• ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను ఇంకా సమర్ధవంతంగా అమలు చేయాలంటే ప్రజల సహకారం పూర్తిగా ఉండాలి.

3.విశాఖపట్నం భూములు-సిట్ విచారణపై అభిప్రాయ సేకరణ:

1).మొత్తం 3,80,007 మందికి ఫోన్ చేయగా, 2,31,558 స్పందించారు. వారిలో 76,191 తమ అభిప్రాయాలు వెల్లడించారు.
2).విశాఖపట్నంలో జరిగిన భూకబ్జాలు మరియు ఇతర అక్రమాలపై విచారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు సిట్ తో ఎంక్వైరీ చేయడంపై బాగుందని 78% అభిప్రాయం వెల్లడించారు. బాగాలేదని 18%, తెలియదని 4% అన్నారు.
3).సిట్ దర్యాప్తుపై మీ అభిప్రాయం వెల్లడించమని కోరగా మంచిది అని 91% చెప్పారు.
4).ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి భూకబ్జాలు మరియు ఇతర అక్రమాలను నియంత్రించవచ్చు అని అడగగా, ప్రధానంగా…
ల్యాండ్ రిజిస్ట్రేషన్లలో చట్టపరమైన మార్పులు తీసుకురావాలని -35%,
ఆన్ లైన్ పద్ధతిని పటిష్టపరచాలని -21% మంది,
కొత్త సర్వే నిర్వహించి ల్యాండ్ రికార్డులను పొందుపరచాలని-16% ,
ల్యాండ్ మాఫియాను రూపుమాపాలని 12% మంది కోరారు.

4.విశాఖపట్నంలో కొత్తగా పట్టాల పంపిణిపై అభిప్రాయ సేకరణ:

1).మొత్తం 47,315 మందికి ఫోన్ చేయగా, 34,365 స్పందించారు. వారిలో 16,510 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు.
2). ప్రభుత్వ భూములను క్రమబద్దీకరణ చేసి పట్టాలు ఇచ్చిన ప్రక్రియపై సంతృప్తి చెందాము అని 96% మంది తెలిపారు.
3).ఇళ్లపట్టాలను మహిళల పేరుతో మంజూరుచేయడం/ 100గజాల లోపు స్థలాల పట్టాలను మహిళల పేరుతో ఇవ్వడం వల్ల వారికి ఆర్ధిక భరోసా కలుగుతుందా అని అడగగా 99% మంచిది అని అభిప్రాయం వెలిబుచ్చారు.
4).పట్టాలు తమకు అందలేదని 10% మంది, ఇబ్బందులు ఎదురయ్యాయని 6% మంది ఫిర్యాదు చేశారు. తక్షణ చర్యలు తీసుకోవడంతో చాలావరకు సమస్య పరిష్కరించడం జరిగింది.
5).పట్టాల పంపిణిలో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడ్డారా అని అడగగా ‘‘అవును అని కేవలం 1%’’ అన్నారు. దీనిపై కూడా విచారణ చేపట్టాం.
6).పట్టాలు అందని వారి ఫిర్యాదులను పరిష్కరించేటప్పుడు ఎవరైనా అవినీతికి పాల్పడ్డారా అని అడగగా, 35 మంది అవును అన్నారు. వీరి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించాం.

5.టౌన్ ప్లానింగ్ –ఆన్ లైన్ పద్దతిలో బిల్డింగ్ ప్లాన్ ల ఆమోదంపై అభిప్రాయ సేకరణ:

1).మొత్తం 22,682 మందికి ఫోన్ చేయగా, 21,032 స్పందించారు. వారిలో 13,859 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు.
2).బిల్డింగ్ అనుమతి కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారా అని అడగగా 96% అవును అని చెప్పారు.ఆన్ లైన్  విధానం బాగుందా అని అడగగా 85% బాగుంది అని, 9% ఫర్వాలేదని, 6%బాగాలేదని అన్నారు.
3). బాగాలేదని అన్నవారిని కారణాలు అడగగా 42% విధానం సరళంగా లేదని, 24% అవగాహన లేదని, 23% లైసెన్స్ సర్వేయర్ల ఫీజు అధికంగా ఉందని తెలిపారు.
4).ఎవరైనా అవినీతికి పాల్పడ్డారా అని అడగగా, 90%మంది లేదని తెలిపారు. మిగిలిన 10%మందిని అవినీతికి పాల్పడినవారి గురించి అడగగా
సంబంధిత అధికారులపై -74%,
ప్రజాప్రతినిధులపై –         6%,
ఇతరులపై –                 20% ఫిర్యాదు చేశారు.

6.‘‘అన్న అమృత హస్తం’’ అమలుపై అభిప్రాయ సేకరణ:

1).మొత్తం 87,762 మందికి ఫోన్ చేయగా, 70,017 మంది స్పందించారు. వారిలో 40,139 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు.
2).అన్న అమృత హస్తం పథకం ద్వారా మీరు అంగన్వాడి కేంద్రంలో భోజన సదుపాయం ఉపయోగించుకుంటున్నారా అని అడగగా, 83% అవును అని, 17% లేదని తెలిపారు.
3).అంగన్ వాడి కేంద్రంలో భోజనం పెట్టడం మీకు సౌకర్యంగా ఉందా అని అడగగా, 85% అవును అని, 15% లేదు అని చెప్పారు.
4).ఎందుకు సౌకర్యంగా లేదు అన్న ప్రశ్నకు, 60%మంది అంగన్ వాడి కేంద్రం దూరంగా ఉందని, 16% కేంద్రంలో వసతులు సరిగ్గా లేవని, 24% భోజనం బాగోదని తెలిపారు.
5).భోజనం నాణ్యత ఎలా ఉంది అని అడగగా, 74% బాగా ఉందని, 19% ఫర్వాలేదని, 7% సరిగ్గా లేదు అని చెప్పారు.
6).భోజనం పెట్టడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉందా, లేక మీ ఇంటికే సరుకులు ఇవ్వడం బాగుంటుందా అని అడగగా, 61% ఇంటికే సరుకులు పంపడం బాగుంటుందని, 39% భోజనం పెట్టడమే బాగుంటుందని అన్నారు.
7).ప్రస్తుతం ఇస్తున్న అన్నం,పప్పు,పాలు,గుడ్లు బదులుగా ఇంకేమైనా కోరుకుంటున్నారా అని అడగగా, ఇప్పుడు ఇస్తున్న ఆహారమే బాగుందని 59%, రాగులు, పళ్లు, ఆకుకూరలు ఇవ్వాలని 38% అన్నారు.
8).ఏ బియ్యంతో వండిన అన్నం పెడితే బాగుంటుంది అని అడగగా 83%మంది పాతబియ్యంతో వండిన అన్నం పెట్టాలని కోరారు.