రాహుల్‌పై ప్రశంసల వర్షం

Priyanaka vadhera Gandhi
Priyanaka vadhera Gandhi

రాహుల్‌పై ప్రశంసల వర్షం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె, ప్రియాంక వథేరాగాంధీ తన సోదరుడు రాహుల్‌గాంధీపై ప్రశంసల వర్షం కురిపించింది.. కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యలు ప్రియాంక చేపడతారన్న వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమ తన సోదరుడిపై పొగడ్తల జల్లు కురిపించటం ప్రాధాన్యత సంతరించుకుంది.. యుపి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీపార్టీతో పొత్తు కుదుర్చుకోవటం రాహుల్‌గాంధీ విజయంగా ప్రియాంక అభివర్ణించారు. ప్రియాంక భర్త రాబర్టవథేరా కూడ తన ఫేస్‌బుక్‌లో చేసి ఒక పోస్టులో రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.. రాహుల్‌ను ఆయన యూత్‌ ఐకాన్‌గా అబివర్ణించారు.